
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగరంలోని కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా ఆదివారం ఉదయం నుండి 11,12,13 డివిజన్ లలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మరియు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల మేయర్ అభ్యర్థి శ్రీ శిల్ప, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి లు బలమూరి విజయ లక్ష్మి , టీడీపీ అభ్యర్థి కల్లూరి ప్రసూన మరియు టీడీపీ అభ్యర్థి గద్దల శ్రావణ్ గార్లకు మద్దతుగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మరియు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల అందరకూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అలాగే, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న ప్రయోజనాలను ఇంటింటికీ వెళ్లి వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి, స్థానిక అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు.