
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మహర్షి వాల్మీకి మానవతా విలువలు, సన్మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని కలెక్టర్ ఎం. విజయ సునీత వెల్లడి.కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్.రామాయణ మహాకావ్యం మానవ జీవితానికి, ధర్మానికి, మార్గదర్శకత్వానికి నిలువెత్తు నిదర్శనమని కలెక్టర్ వ్యాఖ్య.ధర్మం, సత్యం, సదాచారం, భక్తి, జ్ఞానం వంటి వాల్మీకి మహర్షి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపు.సమాజంలో శాంతి, సమరసత, సమగ్రత సాధనకు మహర్షుల బోధనలు ఎంతో ఉపయోగకరమని వెల్లడి.జిల్లా ప్రజలందరికీ మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఎం. విజయ సునీత.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని మహర్షి వాల్మీకికి నివాళులర్పించారు……