
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాళెం ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ సర్పంచ్ శ్రీ వల్లహాపురం నవీన్ గారితో పాటు 30 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు మండలం తెలుగు యువత అధ్యక్షుడు సూర్య గారి ఆధ్వర్యంలో నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని తెలియజేశాను.