
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.అద్దంకి సీఐ గారి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కాలనీలోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
