
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
అర్ణబ్ తుఫాను హెచ్చరిక తో సింగరాయకొండ తీరప్రాంతం లో చేపట్టాల్సిన ముందు జాగ్రతలు, చర్యల గురించి శాంతి భద్రతల పరిరక్షణ, మెరైన్ పోలీస్ అధికారుల తో సింగరాయకొండ తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్ సమీక్షించారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తీర ప్రాంతంలో తుఫాను హెచ్చరిక సందర్భంగా ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా పోలీస్, మెరైన్, గ్రామ పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు.