
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు–ఒంగోలు హైవే రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గమనించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు వెంటనే స్పందించారు. తన ప్రయాణాన్ని పక్కనపెట్టి, బాధితుడిప్రాణాలనుకాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టారు.వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, వైద్యుడికి నేరుగా ఫోన్ చేసి అత్యవసర వైద్యం అందించాలని సూచించారు. ఆపదలో ఉన్న వ్యక్తికి సకాలంలో వైద్య సహాయం అందేలా స్వయంగా చొరవ తీసుకోవడం ఆయన మానవతా దృక్పథానికి అద్దం పడుతోంది.