
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, IAS అధికారులను ఆదేశించారు.ఓట్ల లెక్కింపు కేంద్రంగా ప్రతిపాదించిన ఒంగోలు నగర శివారులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పత్రాల వర్గీకరణ, సీసీటీవీ నిఘా, భద్రతా చర్యలు, అధికారులు మరియు ఏజెంట్ల ప్రవేశ మార్గాలపై సమీక్షించారు. ఓట్ల లెక్కింపులో ప్రతి దశలోనూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.