
సమాజ శ్రేయస్సు కొరకు మనమంతా రక్తదానం చేయుటలో ముందుండాలి.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు గారితో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు కలసి ఒంగోలు పోలీస్ కల్యాణ మండపంలో పోలీస్ సిబ్బందికి మెడికల్ క్యాంపు మరియు రక్తదాన శిబిరమును ప్రారంభించారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు గారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, రక్షణ, శాంతియుత వాతావరణానికి ప్రాణాలు అర్పించిన పోలీసు అమర వీరుల త్యాగాల స్పూర్తితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, రోడ్డు ప్రమాదాలు, కాన్పులు, ప్రాణాంతకరమైన వ్యాధులు మరియు ఇతర ప్రాణాపాయస్ధితిలో సరైన సమయానికి రక్తం లభించక చాలా మంది మరణిస్తున్నారని, అందువల్ల అత్యవసర సమయాల్లో మనం రక్తదానం చేస్తే ప్రాణ దానం చేసినట్లేనని, కావున సమాజ శ్రేయస్సు కొరకు మనమంతా రక్తదానం చేయుటలో ముందుండాలన్నారు. రక్తదానం చేసిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజలకు ఫ్రూట్ జ్యూస్ మరియు బిస్కెట్లను అందజేసారు. సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలను అడిషనల్ ఎస్పీ గారు అభినందించి, సర్టిఫికేట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విద్యార్థులు మరియు ప్రజలు సుమారు 130 మంది రక్త దానం చేశారు.పోలీసు విధులు కష్టతరమైనవని, ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉంటాయన్నారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స పొందాలని సూచించారు. అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, పోలీస్ యూనిట్ డాక్టర్ శ్రీనివాసరావు, పిటిసి డాక్టర్ సుధా,బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ సందీప్ శ్రీనివాస్,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
