
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల సమరంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఉలవపాడు గుడ్లూరు ఓలేటివారిపాలెం లింగసముద్రం మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు పోటీ చేసిన అభ్యర్థులకు విజయాన్ని అందించాలని కోరుతూ ఓటర్ల మహాశయులను కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అన్ని మండలాల జడ్పిటిసి లతోపాటు మెజారిటీ ఎంపీటీసీలను గెలిపించుకొని జగనన్నకు గిఫ్టుగా అందించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. జగనన్న అందించిన సంక్షేమం అభివృద్ధి గ్రామ స్వరాజ్య పరిపాలన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజి హెల్త్ క్లినిక్లు మహిళలకు భరోసా కల్పిస్తూ సాగిన పరిపాలన మళ్లీ రావాలంటే స్థానిక సంస్థల్లో అభ్యర్థులను గెలిపించి విజయాన్ని అందించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అవ్వ తాతలను దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు చిరు వ్యాపారులను పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల స్థానిక ఎమ్మెల్యే పట్ల అసహనం వ్యక్తం అవుతుందని ప్రజల్లో మార్పు కనిపిస్తుందని అన్నారు.