google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ పామూరు:-
బుధవారo ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా సీఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ, ద్వితీయ
పరీక్షల్లో ఫెయిల్ అయినా నిరుత్సాహపడకూడదని, ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోవడం పిరికితనం అన్నారు. గెలుపు-ఓటములు సహజమని, ఓటమితో కృంగిపోకుండా మళ్లీ పట్టుదలతో ప్రయత్నించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని కష్టపడి చదివి మంచి భవిష్యత్తు సాధించాలని సీఐ వినోద్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాసైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.