google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ న్యూఢిల్లీ:-
మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ గారి 100వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ పాల్గొని ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజకీయ చరిత్రలో చంద్రశేఖర్ గారు సత్యనిష్ఠ, ధైర్యం మరియు ప్రజాసేవకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. సామాన్య ప్రజల సమస్యలపై ఆయన చూపిన కట్టుబాటు, నిస్వార్థ సేవ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ముఖ్యంగా యువతకు ఆయన జీవితం ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.