
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
. మార్కాపురం జిల్లా కంభం మండలం ఎంపీడీఓ టి
వీరభద్రచారి శనివారం కందులాపురం 2,3 స్వర్ణ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న సర్వేల వివరాలను సిబ్బంది ఎంపీడీవో కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వీరభద్రచారి మాట్లాడుతూ సర్వేలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.