
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నెల్లూరు జిల్లా సంతపేట పోలీసులకు కీలక విజయం దక్కింది. రాత్రిళ్లు నిద్రిస్తున్న మహిళల మెడల్లో బంగారం లాక్కొనే సీరియల్ నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంతపేట, చిన్నబజార్, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 4 కేసులను ఛేదించి, సుమారు 56 గ్రాముల బంగారం (రూ. 8 లక్షల విలువ)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు రాత్రివేళల్లో తలుపులు తెరిచి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ప్రత్యేక పహారా మరియు కట్టుదిట్టమైన నిఘా చర్యల ద్వారా అతడిని పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు.
ఈ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.