google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో శీలం సభాపతి గారి 77వ జయంతి సందర్భంగా వారి సతీమణి శీలం కోటేశ్వరి గారి సహకారంతో మార్కెట్ యార్డ్ వెనుక ఉన్న నిరుపేద చిన్నారులకు, వృద్ధులకు మంగళవారం ధమ్ బిర్యాని ప్యాకెట్లు, వాటర్ బాటిల్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవాసమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ జయంతి వేడుకలను ఆడంబరంగా కాకుండా ఇలా ఆకలితో ఉన్న పేదవాడి కడుపు నింపడం ద్వారా జరుపుకోవడం ఎంతో తృప్తిని ఇచ్చింది అని భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు, ప్రేమ్, వేణు, విశ్వ, మైత్రేష్, నితీష్, నవీన్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.