google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతిఏటా ఘనంగా జరుపుకునే మహానాడు - 2026 పండుగ… ఈనెల 27,28,29 తేదీల్లో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో, జాతీయ రహదారి పక్కన కిసాన్ సెజ్ ప్రాంగణంలో జరగబోతోంది. మహానాడు వేదిక, ఇతర పనులకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమం బుధవారం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్ర , ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ , సహచర శాసనసభ్యులతో కలిసి… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.MLA నాగేశ్వరరావు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ఐకమత్యంతో, మహానాడును దిగ్విజయంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కందుకూరు నియోజకవర్గం నుంచి వేలసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేస్తామని చెప్పారు.