
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గంలో మే 27,28,29 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సంవత్సరం మహానాడు ను కోవూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, పార్టీ పెద్దలందరికీ ధన్యవాదములు. తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు,ప్రతీ కార్యకర్త తమ ఇంట్లో పండుగ వలె ఈ మహానాడు ని విజయవంతం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు పొంగునూరి నారాయణ , ఆనం రామనారాయణ రెడ్డి , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర , సహచర ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.