
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
ఇంగ్లీష్ పై పట్టు సాధించడం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని గిద్దలూరు ఏ. డి. ఏ రాజశ్రీ అన్నారు. గిద్దలూరు లోని గ్రీన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు బిజ్జం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజ్జం చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఉచిత గ్రామర్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్పొకెన్ ఇంగ్లీషు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలి సూచించారు. అనంతరం విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలను, ప్రశంసా పత్రాలను ఏ. డి. ఏ రాజశ్రీ,, గిద్దలూరు సిటీ కేబుల్ నిర్వాహకులు కత్తెరపల్లె ఓబుల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు పి. విక్టర్ పాల్, సి. పి నవోదయ కోచింగ్ నిర్వాహకులు చీతిరాల ప్రసాద్,సొసైటీ నిర్వాహకులు పాల్గొన్నారు.