
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
తెలుగుదేశం పార్టీ, ఒంగోలు పార్లమెంట్ కార్యాలయానికి నూతనభవనాన్ని…. ఒంగోలు ఓల్డ్ బైపాస్ పక్కన భాగ్యనగర్ లో నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమం బుధవారం ఉదయం జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి , ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి , రాష్ట్ర మారిటైంబోర్డు చైర్మన్ దామచర్ల సత్య , రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ … ఇతర ముఖ్యనేతలతో కలిసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు.