
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో గురువారం కంభం మండలం ఎస్సై ఎ.శివకృష్ణారెడ్డి గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.ఇంకా మహిళలపై నేరాలు, సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచితుల మాటలను నమ్మవద్దని, అనుమానస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.