
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, పేదల పక్షపాతి, దళిత బహుజన బాధిత ప్రజల పక్షాన నిలిచినవారు,కమ్యూనిస్టు భావజాలంతో చివరి వరకు జీవించిన డాక్టర్ మువ్వా కొండయ్య మరణం అత్యంత బాధాకరం.ఆయన మరణం ప్రగతిశీల శక్తులకు తీరని లోటు కందుకూరు ఏరియాలో చిట్టచివరి ప్రజా వైద్యులైన డాక్టర్ మువ్వా కొండయ్య రచయితగా కూడా పేరొందినవారు. డాక్టర్ మువ్వా కొండయ్య మృతి పట్ల జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్, ప్రధాన కార్యదర్శి చనమాల కోటేశ్వరరావు, దమ్మచక్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపాసక గాండ్ల హరి ప్రసాద్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈరోజు బడే వారి పాలెం లోని డాక్టర్ నువ్వా కొండయ్య స్వగృహములోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మువ్వా కొండయ్య మృతి ప్రజా ఉద్యమాలకు దళిత బడుగు బలహీన ప్రజాస్వామ్య శక్తులకు అశనిపాతం లాంటిదని అన్నారు. మువ్వా కొండయ్య గారు విడిచి వెళ్లిన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు