
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, హోమియో డాక్టర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన మువ్వా కొండయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు… బడేవారిపాలెం గ్రామంలో, కొండయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మువ్వా కొండయ్య గారు… హోమియో డాక్టర్ గా కందుకూరు ప్రాంత ప్రజలకు మంచి సేవలు అందించారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. సిపిఎం పార్టీ నాయకుడిగా, అనేక ప్రజా పోరాటాల్లో పాలుపంచుకుని, పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. డాక్టర్ కొండయ్య గారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.