
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
భక్తుల సౌకర్యం కోసం శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ,వరాహ లక్ష్మి నారసింహ స్వామి క్షేత్రం లో భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా సామగ్రి శాల ను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు భక్తులకు పిలుపు ఇచ్చారు. శనివారం దేవాలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన పూజా సామగ్రి శాల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దక్షిణ సింహాచల పుణ్య క్షేత్రం గా పేరుగాంచిన శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిందన్నారు. దేవస్థాన అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరిగిందని ఆసక్తి కలిగిన భక్తులు దాతలు ముందుకు వచ్చి భక్తుల వసతి, సౌకర్యాల కొరకు తమ వంతు సహకరించాలని కోరారు.కొండమీదికి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా సామగ్రి తో పాటు కొబ్బరి కాయలు, శీతల పానీయాలు అందుబాటులో ఉంచేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిణి పాతకోట కృష్ణవేణి ,దేవాలయ అర్చకుడు ఉదయగిరి వెంకట శేష లక్ష్మీ నారసింహా చార్యులు ఆలయ సిబ్బంది,బాపట్ల బ్రహ్మయ్య, పూజా సామగ్రి శాల నిర్వాహకురాలు కొట్టే సుబ్బ రత్నమ్మ స్వామి వారి భక్తుడు ప్రసాదు భక్తులు పాల్గొన్నారు.