
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఆదివారం నియోజకవర్గ పరిధిలోని వలేటివారిపాలెం మరియు కందుకూరు మండలాల్లో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై, ఆయా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాను. వలేటివారిపాలెం మండలం:
పోలినేనిచెరువు పంచాయతీ వీరన్నపాలెం గ్రామంలో వల్లెం మల్లికార్జునరెడ్డి - కృష్ణవేణి దంపతుల కుమార్తె మానస వివాహం సందర్భంగా, వారి నివాసంలో జరిగిన నలుగు కార్యక్రమానికి హాజరై పెండ్లి కుమార్తెను మనసారా ఆశీర్వదించాను.
కందుకూరు మండలం:
ఓగూరు గ్రామంలో చల్లా వెంకట్రావు - సుజాత దంపతుల కుమారుడు సాయికృష్ణ, హర్షితల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను దీవించాను. వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించాను.