
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన గోపి మెమోరియల్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలలో భాగంగా ఆదివారం ఎస్ కే సి సి మరియు అన్వర్ లెవన్స్ టీముల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా ఎస్.కె. సిసి టీం అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మొదటి స్థానం సాధించిన ఎస్కే సి సి టీంకు 50 వేల రూపాయలు మరియు రెండు మూడు స్థానాలు లలో విజయం సాధించిన టీం లకు 30 వేల రూపాయలు మరియు 20వేల రూపాయలను అందజేసిన సిఐ శ్రీహరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య టౌన్ అధ్యక్షులు యధాని టిడిపి సీనియర్ నాయకులు సుబ్బారావు, చంటి, నరసింహ, రవి, సుబ్బారావు, అంకమ్మరావు మరియు గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు.