
పోలవరం ప్రాజెక్టు పనులు, నిధుల విడుదలపై సంప్రదింపులు
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటోంది. ఇక పాలన.. ప్రభుత్వ పరంగా మార్పులకు కూటమి ముఖ్య నేతలు సమాయత్తం అవుతున్నారు.
ఇటు ప్రధాని హైదరాబాద్ పర్యటనలో ప్రత్యేకంగా చంద్రబాబు.. పవన్ నివాసాలకు వెళ్లారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. తాజా పరిణామాల పైన చర్చించనున్నారు. అదే విధంగా ఇతర మంత్రులతోనూ చంద్రబాబు సమావేశం అవుతున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ప్రభుత్వ వ్యవహారాలతో పాటుగా రాజకీయ కీలక అంశాల పైన కేంద్రంలోని ముఖ్యులతో చర్చించనున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ దిశ గా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు పనులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు.