
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
హైవేలపై రాత్రివేళల్లో నిద్రమత్తు, అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వినూత్నంగా ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, ప్రయాణిస్తున్న డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వాహనాలను ఆపి డ్రైవర్లకు ముఖం కడుక్కునే సదుపాయం, టీ అందిస్తూ, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సురక్షితంగా ప్రయాణం కొనసాగించాలని సూచిస్తున్నారు. నిద్రమత్తుతో డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని, డ్రైవర్ భద్రతతో పాటు వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల భద్రత కూడా అంతే ముఖ్యమని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాత్రివేళల్లో జరిగే ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత చైతన్యం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం & మార్కాపురం పోలీసులు తెలిపారు.