
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ లో గల టుబాకో బోర్డు నెంబర్ 27 నందు పొగాకు బెళ్ళు కొనుగోలు జరుగుతున్న తీరును రైతు నాయకులతో కలిసి కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోలు చేస్తున్న కంపెనీ ప్రతినిధులను ఉద్దేశించి శివరాం మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ఇవ్వాలని లేనిపక్షంలో రైతులతో కలిసి పొగాకు బోర్డును బాయ్ కట్ చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పొగాకు కంపెనీలు సిండికేట్ అయి రైతులను దగా చేస్తున్నారని శివరాం ఆరోపించారు. త్వరలో రైతు నాయకులతో కలిసి పొగాకు కంపెనీల యాజమాన్యంతో సమావేశం అవుతామని , అప్పటికి రైతులకు న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రైతుల సమస్యను తీసుకెళ్లి పరిష్కారం అయ్యేంతవరకు రైతులకు అండగా ఉంటామని రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని శివరాం రైతులకు భరోసా ఇచ్చారు. శివరాం వెంట రైతు నాయకులు తానికొండ రమణయ్య , శివారెడ్డి , ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం మాజీ కో ఆర్డినేటర్ కాకర్ల మల్లికార్జున రావు , కందుకూరు నియోజకవర్గం తెలుగురైతు కమిటీ మీడియా కో ఆర్డినేటర్ దివి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు…..