
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ప్రకాశం జిల్లా టంగుటూరు మండల కార్యాలయం నందు కిషోరీ వికాసం - వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పాల్గొనినారు. ఈ కార్యక్రమంలో కిషోరీ బాలబాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొనినారు.జాయింట్ కలెక్టర్ గారు కిషోరీ బాలబాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించాలని,సైబర్ నేరగాళ్లు గురించి చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వకూడదు అని వాటి వల్ల చిన్న పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుంది అని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీఓ Y అంజమ్మ , mro ఆంజనేయులు , ఐసిడిఎస్ సూపర్వైజర్స్ సుచరిత , జ్యోతి. సత్యవతి గార్లు అంగన్వాడీ వర్కర్లు పాల్గొనినారు.