
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
హనుమాన్ జయంతి సందర్భంగా, వలేటివారిపాలెం మండలంలోని హనుమాన్ ఆలయాల్లో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. పోలినేనివారిపాలెం, వలేటివారిపాలెం గ్రామాల వద్ద స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…. నాయకులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో కొద్దిసేపు మాట్లాడారు. కార్యక్రమాల్లో మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు కాకుమాని హర్ష, కామినేని అశోక్, కాకుమాని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.