
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ సూర్యలంక బీచ్‌ను సందర్శించి, మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్, ఎస్పీ ఉమా మహేశ్వరరావుతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుమారు రూ.100 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న స్వదేశ్ దర్శన్ 2.0 అభివృద్ధి పనులను సమీక్షించారు. సమావేశంలో డా. బాలాజీతో పాటు గౌరవ మంత్రులు ప్రస్తుత డిజైన్లు ఆశించిన స్థాయిలో లేవని అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో వేగం గా జరగటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, డీపీఆర్‌కు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం “బే ఆఫ్ బాపట్ల” లోగోను ఆవిష్కరించారు అనంతరం వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ జెట్ స్కీ, ఏటీవీ బైక్స్, వాటర్ జోర్బింగ్ తదితర స్పోర్ట్స్ కార్యకలాపాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.