
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారి ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనగా 12.05.2026 న ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ CH.హాజరత్తయ్య, ఆర్ ఎస్సై మాల్యాద్రి మరియు వారి సిబ్బంది కలసి ఒంగోలులోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాల లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ఆవాహన కల్పించారు .ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, వాహనాలను అతి వేగంగా నడపరాదని (Over Speed), మైనర్ డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మాడిఫైడ్ సైలెన్సర్ ( పెద్ద శబ్దాలు వచ్చే సైలెన్సర్ లను) వాడరాదని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని మరియు వాహనదారులందరూ M.V. Act రూల్స్ పాటించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది మరియు Traffic Rules, జరిమానాలు గురించి తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండంట్, అధ్యాపకులు మరియు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.