
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల ఎస్సీ పాలెం కు చెందిన బుక్క ప్రకాశం, నిర్మల వారి కుమార్తె ప్రవళిక వివాహానికి వైసిపి నాయకులు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి రూ.25 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్వయంగా గ్రామానికి వెళ్లిన రమణారెడ్డి గారు స్థానిక వైసిపి నాయకులతో కలిసి ప్రవళికకు నగదు అందజేశారు. గతంలోనే ప్రవళిక తల్లిదండ్రులు ప్రకాశం, నిర్మల స్వర్గస్తులయ్యారు. వివాహానికి ఆర్థిక సహాయం అందించిన రమణారెడ్డి గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.