
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఈ ఏడాది మార్చి 26వ తేదీన మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో, వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన ఒక మహిళ చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.
ఆ ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు… బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఈరోజు అంక భూపాలపురం వెళ్లి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం పంపించిన చెక్కులను వారికి అందించారు.బస్సు ప్రమాదంలో మృతి చెందిన బండారు పద్మ కుటుంబానికి 5 లక్షలు మంజూరు కాగా, ఆమె తల్లి అనంతమ్మకు ఎమ్మెల్యే గారు చెక్కు అందించారు. పద్మ పిల్లలు ఇద్దరినీ NTR ట్రస్ట్ భవన్ స్కూల్ లో చదివిస్తామని హామీ ఇచ్చారు.తీవ్రంగా గాయపడ్డ బత్తుల మణెమ్మ ను పరామర్శించిన ఎమ్మెల్యే గారు… ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. 2 లక్షల రూపాయల చెక్కును ఆమె భర్త వెంకటయ్యకు అందించారు. ఒంగోలు రిమ్స్ RM తో మాట్లాడి, మణెమ్మకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మరో బాధిత చిన్నారి బత్తుల రోహన్ ను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరామర్శించారు. బాలుడి తల్లి శ్రీలక్ష్మికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందించారు. రోహన్ చదువుకు అన్నివిధాలా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… బస్సు ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బాధిత కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించిందని గుర్తుచేశారు. తాను కూడా ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించానన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాలు కూడా త్వరలోనే బాధితులకు అందజేస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, పార్టీ నాయకులు పెగడ శ్రీను, మోహన్, బండారు సోమరాజు, మాల్యాద్రి, పంది లక్ష్మీనారాయణ, సిరిగిరి కొండారెడ్డి, నరసింహం, వలేటి మధు తదితరులు పాల్గొన్నారు.