
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో పోలీసుల నిరంతర పర్యవేక్షణ ద్వారా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు, నేరాలకు అడ్డుకట్ట వేయడం కోసం వాహన తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల పరిశీలన, రాత్రి పహారా మరియు ప్రత్యేక తనిఖీలను కొనసాగిస్తున్నారు. “ప్రజల భద్రతే మా ప్రాధాన్యం” అనే సందేశంతో మార్కాపురం పోలీసులు స్మార్ట్ & విజిబుల్ పోలీసింగ్ ద్వారా అప్రమత్తంగా సేవలందిస్తున్నారు.