
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సౌత్ బైపాస్ జంక్షన్, ప్రగతి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన "అమర్ హాస్పిటల్స్" ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మరియు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం హర్షణీయమని కొనియాడారు. స్థానిక ప్రజలకు మెరుగైన మరియు నాణ్యమైన చికిత్సను సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో తెచ్చినందుకు ఆసుపత్రి యాజమాన్యాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ఆసుపత్రి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం, స్థానిక నాయకులు మరియు ప్రగతి కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో సేవలందించేందుకు సిద్ధమైన అమర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు.