
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
సింగరాయకొండ డా. ఆదిమూలపు సురేష్ గారి క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీ టంగుటూరు మండల అధ్యక్షులు శ్రీ చింతపల్లి హరిబాబు గారి నాయకత్వంలో మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ గారి సమక్షంలో టంగుటూరు టౌన్ పరిధి పోతల చెంచయ్య కాలనీ వెస్ట్ ముస్లిమ్స్ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కండవు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి టంగుటూరు టౌన్ అధ్యక్షులు కొమ్ము సురేందర్ గారు, షేక్ సమీరా ఖాసీం గారు, షేక్ యాసిన్ పాల్గొన్నారు.