
న్యాయమూర్తులుగా ఏ ప్రాంతములోనైనా సమర్థవంతంగా పనిచేయాలి.
కందుకూరు సీనియర్ సివిల్ జడ్జ్ కే. కే.వి బుల్లికృష్ణ .
కందుకూరు బార్ అసోసియేషన్ లో వివాదారహితంగా పనిచేసిన మెజిస్ట్రేట్ గారికి అభినందనలు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలేటి శ్రీధర్ నాయుడు.
కందుకూరు అడిషనల్ డిస్టిక్ మున్సిప్ మెజిస్ట్రేట్ గా పనిచేసి బదిలీ మీద వెళుతున్న ఎన్. నిఖిల్ రెడ్డి గారికి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగినది. ఈ వీడ్కోలు సభా కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వలేటి శ్రీధర్ నాయుడు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కందుకూరు బార్ అసోసియేషన్ లో మెజిస్ట్రేట్ గా మొదటి పోస్టింగ్ పొంది తను పనిచేసిన కాలంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు సమన్యాయం చేసే విధంగా వ్యవహరించిన ఆఫీసర్ బదిలీ మీద వెళ్ళటం ఎంతో బాధాకరమని ఆయన పనిచేసే ప్రాంతంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కందుకూర్ సీనియర్ సివిల్ జడ్జి కె. కె.వి.బుల్లికృష్ణ గారు మాట్లాడుతూ న్యాయమూర్తి పనిచేసిన ప్రాంతం నుండి బదిలీ అవ్వాలంటే కొంత బాధాకరంగానే ఉంటుందని అప్పటివరకు పనిచేసిన కోర్టు సిబ్బంది న్యాయవాదులు తో ఉన్న అనుబంధం గుర్తుకు వస్తుందని అన్నారు. న్యాయమూర్తిగా అన్ని ప్రాంతాల్లో పనిచేయుటకు సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. బదిలీ మీద వెళుతున్న అడిషనల్ డిస్టిక్ట్ మున్సిప్ మేజిస్ట్రేట్ ఎన్. నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ నా మొదటి పోస్టింగ్ ద్వారా ఇక్కడనే నా జర్నీ ప్రారంభించానని ఇక్కడున్న న్యాయవాదులు నాకు ఎంతో సహకరించారని వారి ప్రోత్సాహం వలనే మంచి ఆఫీసర్ గా ఇక్కడనుంచి బదిలీ మీద వెళుతున్నానని బదిలీ సందర్భంగా నాకు ఘనమైన వీడ్కోలు ఇచ్చిన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బెజవాడ కృష్ణయ్య సీనియర్ న్యాయవాదులు వై సాంబశివరావు, కొత్తూరు హరికోటేశ్వరరావు, పెన్నా కృష్ణయ్య,గౌడపేరి. కోటేశ్వరరావు, ముప్పవరపు కిషోర్,సిహెచ్ హరికృష్ణ, బొందు రోశయ్య,బివి శేషయ్య, టి.తిరుమలరావు, ఎం మహేశ్వరరావు,బట్టర్ శెట్టి సాయి శంకరు,ఎం ప్రసాద్ రెడ్డి,బివి మురళీకృష్ణ,ఎస్ పవన్ కుమార్, పండిత్ సంపత్ కుమార్, షేక్ సంసుద్దీన్,సిహెచ్ నాగేంద్ర శర్మ,డి మాధవరావు,చుండి మురళీధర్, షేక్ జమీర్, షేక్ యాసిన్ జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బదిలీ మీద వెళుతున్న మెజిస్ట్రేట్ ఎన్ నిఖిల్ రెడ్డి గారికి పూలమాలలు వేసి దృశ్యావాలు కప్పి బహుమతులతో ఘనంగా సన్మానం చేశారు.