
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
ఉలవపాడు మండలం లోని శ్రీ సాయి రామ్ భారత్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ మరియు ఆఫీసు ను జిల్లా పౌరసరఫరా అధికారి ఎస్ పద్మశ్రీ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి గోడౌన్ లో ఖాళీ సిలిండర్లు మరియు ఫుల్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయో చూసి ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం సరిపోయ్యాయ లేదా చెక్ చేశారు. ధరల పట్టికల బోర్డులు వినియోగదారులకు అందుబాటులో ఉండేలాగా చూడాలని ఆదేశించారు. ఖాళీ ఫుల్ సిలిండర్ ఇచ్చేటప్పుడు తప్పకుండా ఖాళీ సిలిండర్ ఉండాలి అని వివరించారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీ టీ విజయ్ భాస్కర్ విఆర్ఓ పవన్ కుమార్ మరియు గ్యాస్ ఏజెన్సీ ఓనర్లు కల్లూరి వెంకటేశ్వర్లు మరియు మాధవి పాల్గొన్నారు.