
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఫుట్ పాత్ ఆక్రమించిట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కందుకూరు పట్టణ ఎస్సై శివ నాగరాజు తెలిపారు. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు లో ఫుట్ పాత్ ని ఆక్రమించి న షాపుల యజమానుల చేత ఖాళీ చేయించారు. మరోసారి ఫుట్పాతులు నాక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫుట్ పాత్ లు ఆక్రమించడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఇది గమనించి పట్టణంలోని షాపుల వారందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.