
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు పట్టణంలోని సబ్ జైల్ ను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్చార్జి సెక్రటరీ మరియు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ సీహెచ్. వి. రామకృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైల్లో ఉన్న ప్రతి ఒక్కరి కేసుల వివరములను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి ప్రవర్తించాలన్నారు. క్షణికావేశంలో నేరాలు చేయకూడదని, ఆవేశం అనర్ధాయకమని తెలియజేశారు. బెయిల్, సింగిల్ షూరిటీ మరియు అర్హులకు ఉచిత న్యాయ సహాయం గురించి తెలియజేశారు. బెయిల్ పొందిన వారు సదరు కేసు పూర్తయ్యే వరకు కోర్టు ముందు ప్రతి వాయిదాకు హాజరు కావాలన్నారు. తదుపరి ఖైదీలకు అందుతున్న సదుపాయములను ,ఆహార పదార్ధములను మరియు సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కె. భరత్ చంద్ర ,లీగల్ ఎయిడ్ న్యాయవాది బి .రాజ్ కుమార్ నాయక్, సబ్ జైల్ సూపరిండెంట్ యూ. లింగారెడ్డి, పారా లీగల్ వాలంటీర్ అద్దంకి. మధుసూధనరావు ,జైల్లో ఉన్న ఖైదీలు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.