
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు సమర్థవంతమైన నిఘా కోసం మార్కాపురం జిల్లా పోలీసులు తార్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానాగులవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ కింద డ్రోన్ సాంకేతికతను వినియోగించారు.పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే తిరునాళ్లలో జనసమ్మర్థం, ట్రాఫిక్ పరిస్థితులు, అనుమానాస్పద కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ చేపట్టారు. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా ఉత్సవ ప్రాంగణం మొత్తం పరిస్థితిని గమనిస్తూ భక్తులకు భద్రత కల్పించే చర్యలు చేపట్టారు.
ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా ఉత్సవాల్లో పాల్గొనేలా అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.