
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తిపై మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దాడి నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్.ఎం.పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుండి Good Friends Deluxe 90 ఎంఎల్‌కు చెందిన 27 బాటిళ్లు, Imperial Blue Select Grain Whisky 180 ఎంఎల్‌కు చెందిన 5 బాటిళ్లు, SNJ 1000 Beer 650 ఎంఎల్‌కు చెందిన 6 బాటిళ్లు మొత్తం 38 మద్యం బాటిళ్లను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.