
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా ఒక్కరోజు పాటు అన్ని మెడికల్ దుకాణాలు బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ డిమాండ్ల సాధన మరియు సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అత్యవసర వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అసోసియేషన్ హామీ ఇచ్చింది. ఈ బంద్కు సంఘీభావంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి మెడికల్ దుకాణదారుడు ఈ బంద్కు సహకరించాలని, అలాగే ప్రజలు కూడా సహకారం అందించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.