
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీయస్., గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI భీమా నాయక్ గారి ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య మరియు సిబ్బంది దాడులు నిర్వహించారు.అక్రమ కోడి పందేల నిర్వహణపై ఒంగోలు టాస్క్ఫోర్స్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. N G పాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పుగుంటూరు, ఉమ్మేవరం మధ్య నిర్వహించిన దాడిలో అక్రమంగా కోడి పందేలు నిర్వహిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోళ్ళు రెండు సెల్ ఫోన్లు 1 మోటర్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. వారిని NG పాడు పోలీస్ స్టేషన్లో అప్పగించడం అయినది.