
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
“మీ ఆరోగ్యం మీ చేతుల్లో – బాధ్యత మీది – భరోసా మాది” అనే ప్రభుత్వ నినాదంతో జిల్లా ద్వితీయ స్థాయి ఆరోగ్య విభాగం ఆదేశాలనుసారం “ఎన్సిడి క్లినిక్ - 333” సేవలను కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో NCD(Non-Communicable Diseases) క్లినిక్ సెంటర్ను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తో కలిసి ప్రారంభించారు ఎన్ సి డి అంటే Non-Communicable Diseases (సంక్రమణ చెందని వ్యాధులు). ఇవి జన్యు, శారీరక, పర్యావరణ మరియు జీవనశైలి సంబంధిత కారణాల వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధులు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ క్లినిక్ ఉపయోగపడుతుంది.ఈ సందర్భంగా డాక్టర్ ఇంద్రాణి మాట్లాడుతూ, ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.NCD కార్యక్రమానికి సంబంధించిన వివరాలను డాక్టర్ తులసిరామ్ వెల్లడిస్తూ, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు షుగర్, బీపీ, క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారికి జెరియాట్రిక్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గించడంలో ఎన్సీడీ కీలకపాత్ర వహిస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గడ్డం మాలకొండయ్య, భూషయ్య, తిరుపాలు, మీనా కుమారి, ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ తులసిరామ్, డాక్టర్ రమాప్రియతో పాటు ఇతర వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.