
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి అప్పాపురం గ్రామంలోని సీతారామ స్వామి దేవస్థానంలో కుర్రు జగదీష్ – చాందినీ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలవికాస్ కేంద్రం చిన్నారులకు విద్యాసామగ్రి, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు శీలం వెంకట్రావు, అరుణ, పూజ, జాహ్నవి, హర్షిత్ పాల్గొని సేవా కార్యక్రమాలను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సమరసత సేవ ఫౌండేషన్ బాలవికాస్ జిల్లా సంయోజక్ అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ, వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆదర్శనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సహసంయోజక్ చిలకపాటి సుధాకర్, మండల సంయోజక్ అంబటి బ్రహ్మయ్య, ధర్మ ప్రచారకులు బుర్ర మల్లికార్జున్, మండల కన్వీనర్లు చిమట సుధాకర్, ప్రముఖ న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు శీలం ప్రసాద్ రావు, సుధాకర్ రెడ్డి, అలా రామకృష్ణ, కరెటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
