
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణం కురిచేడు రోడ్లో ప్రారంభమైన రిషిత సోలార్ & అగ్రి ఎంటర్ప్రైజెస్ కార్యాలయాన్ని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ,టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ 40% సబ్సిడీతో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే గొప్ప అవకాశం లభించిందన్నారు.ఇంటి కరెంటు అవసరాలను మనమే ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ₹78,000 వరకు కేంద్ర సబ్సిడీతో పాటు బ్యాంకు రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబం సోలార్ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.దర్శిని “సోలార్ హబ్”గా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి తహసీల్దార్ ఎం. శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.