
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల్లో నేరాల పట్ల అవగాహన పెంపొందించడం, భద్రతా చైతన్యం కల్పించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు సైబర్ మోసాలు, మహిళా భద్రత, చిన్నారుల రక్షణ, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, ఆస్తి నేరాల నివారణ వంటి కీలక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సైబర్ మోసాలు, నకిలీ లింకులు, ఫేక్ లోన్ యాప్లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు వివరాల దోపిడీలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.అలాగే మహిళలపై నేరాలు, పోక్సో చట్టం (POCSO), చిన్నారుల రక్షణ, షీ టీమ్ సేవలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు మరియు రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. పిల్లలపై వేధింపులు, అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.NDPS చట్టం, గంజాయి మరియు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలు తీవ్రమైన నేరాలని హెచ్చరించారు.అదేవిధంగా రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు, అతివేగం ప్రమాదాలు, ఆస్తి నేరాల నివారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, దొంగతనాల నివారణ చర్యలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.