
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
సోమవారం విడుదలైన ఏపీ లా సెట్ ఫలితాలలో కందుకూరుకు చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. LLB మూడు సంవత్సరాల కోర్సుకు సంబంధించిన లా సెట్ ఫలితాలలో కందుకూరు ఆదిఆంధ్ర కాలనీకి చెందిన సూరపోగు పవన్ కుమార్ కు రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంక్ సాధించాడు. పేద దళిత కుటుంబానికి చెందిన పవన్ కుమార్ రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించడం కందుకూరుకే గర్వంగా ఉందని పలువురు ఆయనను అభినందించారు.