
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం, టంగుటూరు గ్రామపంచాయతి పరిధిలో “స్వచ్ఛ పథం” కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య కార్యనిర్వహన అధికారి జిల్లా ప్రజా పరిషత్ ప్రకాశం జిల్లా, B. చిరంజీవి మరియు జిల్లా పంచాయతీ అధికారి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించి, పారిశుద్ధ్య నిర్వహణపై అవసరమైన సూచనలు చేశారు. టంగుటూరు రోడ్ నుండి సింగరాయకొండ వెళ్లే ప్రధాన రహదారి వరకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను గుర్తించి తొలగించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ కార్మికుల సహకారంతో రహదారులను స్వయంగా శుభ్రపరచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు.ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు “ స్వచ్ఛ పథం ర్యాలీ” నిర్వహించబడింది కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులతో కలిసి రహదారుల శుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకు “ తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం” వన్ బిన్ వన్ బ్యాగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించి, ప్రతిరోజూ గ్రీన్ అంబాసిడర్‌కు వేర్వేరుగా అందజేయాలని సూచించారు. “ మన గ్రామం – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు సహకరించాలి. పరిశుభ్రమైన గ్రామం ఆరోగ్యకరమైన సమాజానికి పునాది.” స్వచ్ఛమైన పరిసరాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రతి ఇంటి నుండి స్వచ్ఛత ప్రారంభమైతే గ్రామం ఆదర్శ గ్రామంగా మారుతుంది.
ఇంటి పన్ను వసూలు కమిషనర్,పంచాయతీరాజ్ వారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల ఒకటి నుంచి ఈనెల చివరి వరకు (అనగా 01.05.2026 నుండి 31.05.2026)ఇంటి పన్ను చెల్లించిన వారికీ 5 శాతం రిబేట్ ఇవ్వబడుతుందని తెలియజేయగా నాయకులు మరియు ప్రజలు ఇంటి పన్ను చెల్లించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డిప్యూటీ ఎంపీడీవో , పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు DPRC సిబ్బంది మరియు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.